ముగించు

జనన ధృవీకరణ పత్రము

జనన ధృవీకరణ పత్రమును పొందుటకు రెండు విధానములు కలవు

    1. పౌర సాంఘిక భాద్యత.
    2. ఆలస్య జనన ధృవీకరణము.
    1. పౌర సాంఘిక భాద్యత:
    2. ఈ విధానము నందు పౌరులు వారి వారి మునిసిపాలిటి/పంచాయితీ లలో వైద్యని ధృవీకరణ పత్రము సహాయముతో పొందవచ్చును. ఈ సదుపాయము బిడ్డ పుట్టిన ఒక సంవత్సరం వరకు మాత్రమే

      S.L.A పీరియడ్ 21 రోజులు. సేవరుసుము ౩౦/- అంతర్జాల చిరునామా http://www.ubd.ap.gov.in:8080/UDBMIS/

    3. ఆలస్య జనన ధృవీకరణము:

    ఈవిధానము నందు పౌరులు దగ్గరలో ఉన్న ‘మీసేవ’ నందు జనన ధృవీకరణ ఒక సంవత్సరం తరువాత నైనా నమోదు చేయించుకోవచ్చును. ఏ ప్రభుత్వ అధికారిని ప్రత్యక్షముగా కలవనవసరం లేదు. దానికి ఈ క్రింది పత్రములు అవసరము.

    1. భౌతిక పత్రము.
    2. పంచాయితీ లేదా మునిసిపాలిటి జారీ చేసిన నిర్లభ్యతా పత్రము.
    3. రేషను కార్డ్ కాపీ.
    4. పదవ తరగతి (SSC) మర్కుల ధృవపత్రము.
    5. స్వయం ధృవీకరణ పత్రము.

    సదరు పేర్కొనిన సేవను ధరఖాస్తు పొందేవరకు కేటగిరి ‘బి’ నందు, పొందిన తరువాత కేటగిరి ‘ఎ’ గాను పరిగనించబడును.

    పై విధముగా పౌరుడు తనకు అవసరమైన ధృవపత్రమును పొందవచ్చును.

    మీ సేవా పోర్టల్ Url: http://ap.meeseva.gov.in/DeptPortal/UserInterface/LoginForm.aspx

    LRBD ధృవపత్రము రెవిన్యూ విభాగము నుండి పొందిన తరువాత మునిసిపాలిటికి గాని పంచాయితీకి గాని పౌరుడు వెళ్ళి జనన ధృవీకరణ పత్రమును పొందవచ్చును.

పర్యటన: http://www.ubd.ap.gov.in:8080/UBDMIS/

ఆంధ్రప్రదేశ్

కలెక్టరేట్, ఏలూరు
ప్రాంతము : కలెక్టరేట్ | నగరం : ఏలూరు | పిన్ కోడ్ : 534007